కూలీ నంబర్ 1.. రైల్వే పోర్టర్​గా మారిన రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రైల్వే కూలీగా మారారు. దిల్లీలోని ఆనంద్​విహార్​ రైల్వే స్టేషన్​ను గురువారం రోజు ఉదయం ఆకస్మాత్తుగా రాహుల్​ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రైల్వే కూలీలతో ముచ్చటించారు. రైల్వేకూలీ మాదిరిగా ఎర్ర చొక్కా ధరించి, వారితో ముచ్చటించడంతో పాటు కొంతసేపు నెత్తిమీద లగేజీ పెట్టుకుని మోశారు.

భారత్‌జోడో యాత్ర తర్వాత వివిధ వర్గాలవారిని రాహుల్ కలుస్తున్నారు. రాహుల్‌ను కలవాలని ఉందని రైల్వే కూలీలు సామాజిక మాధ్యమం వేదికగా ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ విషయం ఆయన వద్దకు చేరడంతో.. దిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుని, వారితో కలిసి కూర్చొని ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌లో పంచుకొంది.

‘రైల్వేకూలీ సోదరులను కలవాలని ఎప్పటినుంచో నా మదిలో ఉంది. వారు కూడా ప్రేమతో నన్ను ఆహ్వానించారు. అలాంటి కష్టజీవుల కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్నా. అది ఇప్పుడు నెరవేరింది’’ అని రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news