నిత్యం రాజకీయాలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు.. ఎన్నికలు.. ప్రజాసేవ.. ఇలా క్షణం తీరికలేకుండా బిజీగా ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాస్త రిలాక్స్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. అందుకే వేషధారణ మార్చారు. బైక్ అందుకుని అలా తన ఫేవరెట్ స్పాట్‌కు రైడ్ చేసుకుంటూ వెళ్లారు. ఓ సాధారణ పౌరుడిలా తనకు దొరికిన కాస్త సమయాన్ని రిలాక్స్ అవ్వడానికి వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన లద్ధాక్ వెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఫొటోల్లో రాహుల్ గాంధీ న్యూలుక్లో కనిపించారు. లద్ధాఖ్ పర్యటనలో ఉన్న ఆయన స్పోర్ట్స్ బైక్‌ను డ్రైవింగ్ చేస్తూ పాంగాంగ్ సరస్సుకు వెళ్లారు. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ.. ‘ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని నా తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారు’ అని క్యాప్షన్ జోడించారు. రాహుల్ బైక్ రైడ్ లుక్‌పై ఆ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.