మోదీ జీ.. మణిపుర్‌ను సందర్శించండి: రాహుల్‌ గాంధీ

-

అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్రంలో శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. దిల్లీలో నివసిస్తోన్న మణిపురి పౌరులతో  భేటీ అయినట్లు రాహుల్ తెలిపారు. వారి బాధలను వివరించారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేసిన రాహుల్ గాంధీ.. భద్రత విషయంలో ఆందోళన, ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో తమ ముఖాలను చూపొద్దని వారు విజ్ఞప్తి చేశారని వెల్లడించారు.

మణిపుర్ లో రెండు గ్రూపులైన మెజార్టీ మైతేయ్, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రాన్ని గతేడాది తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది. వందల మంది ప్రాణాలు తీసింది. ఇప్పటికీ వేల మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ అల్లర్లను చల్లార్చేందుకు మోదీ కృషి చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news