మోదీ గురించి అందరికీ తెలుసు.. ఈసారి బీజేపీకి 150 సీట్లే : రాహుల్ గాంధీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి దేశమంతా తెలుసని, రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లకే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. మరోవైపు ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కలిసి ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజియాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

‘ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ పథకం. ఇది భారత వ్యాపారులకు బాగా తెలుసు. ప్రధాని ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రధాని అవినీతికి కారకుడని దేశం మొత్తానికి తెలుసు. ఎన్నికల నిధుల్లో పారదర్శకతను తీసుకొచ్చేందుకు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినట్లు ప్రధాన మోదీ చెబుతున్నారు. అలా అయితే ఆ పథకాన్ని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టివేసింది. 15-20 రోజుల క్రితం బీజేపీ 180 సీట్లు గెలుస్తుందని అనుకున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడు వారికి 150 సీట్లు వస్తాయని భావిస్తున్నాను.’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news