ఆ రైల్వే ఉద్యోగి చేసిన పని నెటింట్లో వైరల్: వెల్లువెత్తుతున్న అభినందనలు

-

తన వృత్తి ధర్మాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించిన ఓ రైల్వే ఉద్యోగి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు అందుకుంటున్నాడు. అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో కిలో మీటర్లు కాలి నడకన వెళ్లి కమ్యూనికేషన్ డిజైన్‌ ఫిక్స్ చేసి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా చేశాడు. కనీసం దారి కూడా కనిపించని పరిస్థితిలో కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఏడు కిలో మీటర్లు నడించి వెళ్లడానికి ఆ రైల్వే ఉద్యోగి ఏ మాత్రం సంకోచించకపోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలం కావడం వల్ల ట్రాక్‌పైనే చాలా రైళ్లు నిలిచిపోయాయి.

భారీ వర్షం కారణంగా ట్రాక్‌పై నుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా విఫలమైన కమ్యూనికేషన్ డివైజ్ పునరుద్ధరణలో లఖేరి ఎంసీఎఫ్‌ ఉద్యోగి రాహుల్ చూపిన ధైర్య సాహసాలను భారతీయ రైల్వేశాఖ, ముఖ్యంగా కోట రైల్వే డివిజన్ అభినందించింది. అతని స్థానంలో మరో ఉద్యోగి ఉండి ఉంటే కచ్చితంగా నిరాకరించేవాడే. కానీ, తన విధి నిర్వహణలో భాగంగా కారు చీకట్లలో రైల్వే ట్రాక్ గుండా ఏడుకిలోమీటర్లు నడిచి వెళ్లడానికి రాహుల్ సిద్ధపడ్డటం అభినందనీయం.

‘ఈ నెల 3వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో క్రాసింగ్ నెంబర్ 137 దగ్గర కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదని సమాచారం అందింది. భారీ వర్షం కారణంగా లఖేరి, ఇంద్రఘర్ మధ్యలో ట్రాక్ సర్య్యుట్స్, పాయింట్ మెషిన్‌లో చెడిపోయినట్లు గుర్తించాం. దీనివల్ల రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇంద్రఘర్‌లో రాత్రి విధుల్లో ఉన్న రాహుల్ ప్రయాణికుల పాలిట రక్షకుడిగా మారాడు. రాహుల్ దాదాపు కి.మీ.లు నడిచి వెళ్లి క్రాసింగ్ నంబర్ 137 విఫలమైన కమ్యూనికేషన్ వ్యవస్థను సరిదిద్దాడు. మరో 5కి.మీ.లు కాలినడకన వెళ్లి ట్రాక్ సర్క్యూట్స్, పాయింట్ మిషన్‌ను ఫిక్స్ చేశాడు. ఉరుములు, బీకర గాలులతో భారీ వర్షం కురుస్తుండగా రాహుల్ కాలినడకన వెళ్లి నెట్‌వర్క్ సిస్టమ్‌‌ను ఫిక్స్ చేశాడు’ అని అధికారులు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version