రాజ్‌కుంద్రా: ఒక్క వ్యాపారం.. ప‌రువు మొత్తం పోయింది..

-

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ య‌జ‌మాని, ప్ర‌ముఖ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా కు సంబంధించిన వార్త‌లు ఇప్పుడు ఎక్క‌డ చూసినా వైర‌ల్ అవుతున్నాయి. అశ్లీల చిత్రాల‌ను తీస్తూ వాటిని మొబైల్ యాప్‌ల‌లోకి అప్‌లోడ్ చేసి వ్యాపారం చేస్తున్నాడ‌ని తెలియడంతో ముంబై పోలీసులు ఇప్ప‌టికే రాజ్ కుంద్రాను అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే న‌లుగురిలోనూ ఎంతో ప్ర‌తిష్ట‌ను సంపాదించుకున్న రాజ్ కుంద్రా తాను చేసిన ఒక్క వ్యాపారంతో త‌న‌కే కాదు, త‌న భార్య శిల్పాశెట్టికి కూడా మ‌చ్చ తెచ్చాడు.

raj kundra with only one business lost fame and prestige

హాట్ షాట్స్ అనే యాప్ ను ఏర్పాటు చేసిన రాజ్ కుంద్రా మొద‌ట్లో అర్థ‌న‌గ్న దృశ్యాల‌తో కూడిన సిరీస్‌లు, షార్ట్ ఫిలింలు తీయించాడ‌ని తెలుస్తోంది. అయితే క‌రోనా లాక్‌డౌన్ రావ‌డం అత‌నికి క‌ల‌సి వ‌చ్చింది. దీంతో కొంద‌రు జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను మ‌భ్య పెట్టి, వారికి సీరియ‌ల్స‌, సినిమాల్లో అవ‌కాశాలు ఇస్తామ‌ని ఆశ చూపి వారిని హాట్ షాట్స్ కు చెందిన న‌గ్న సినిమాలు, షార్ట్ ఫిలింలు, వీడియోల్లో న‌టింప‌జేశార‌ని తెలుస్తోంది. పోలీసులు ఈ వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించారు.

క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో రాజ్ కుంద్రా అశ్లీల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింద‌ని ముంబై పోలీసులు తెలిపారు. మ‌రో వైపు కేవ‌లం హాట్ షాట్స్ యాప్ మాత్ర‌మేనా ఇంకా ఏమైనా ఇలాంటి యాప్‌ల‌ను సృష్టించారా, ఎంత మంది కుంద్రా బారిన ప‌డి బ‌ల‌య్యారు ? అనే కోణంలోనూ పోలీసులు కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అయితే రాజ్ కుంద్రా వ్య‌వ‌హారం మొద‌టి నుంచీ అనుమానాస్ప‌ద‌మే. అప్ప‌ట్లో ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో 2015లో సుప్రీం కోర్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తోపాటు చెన్నై సూప‌ర్ కింగ్స్ టీమ్‌ను 2 ఏళ్ల పాటు ఐపీఎల్ ఆడ‌కుండా నిషేధించింది. త‌రువాత మ‌ళ్లీ య‌థావిధిగా ఆ జ‌ట్లు ఐపీఎల్ ఆడుతున్నాయి. అక్క‌డితో క‌థ ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు అత‌ను మ‌ళ్లీ ఈ కేసులో చిక్కుకున్నాడు. ఎంతో సాఫీగా వ్యాపారం చేసుకుంటూ కోట్లు సంపాదిస్తూనే ఇలాంటి నీచమైన వ్యాపారం చేయ‌డం ఎందుక‌ని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి సంపాదించుకున్న ప్ర‌తిష్ట‌ను అత‌ను ఒక్క‌సారిగా పోగొట్టుకున్నాడు. త‌న భార్య శిల్పా శెట్టి ప‌రువు కూడా తీశాడు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలోనూ వారిని నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news