నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్.. పోర్న్ వీడియోల కేసులో కీలక ఆధారాలు

-

ముంబై: నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోల కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని విచారించారు. ముంబై కమిషనరేట్ ఆఫీస్‌లో విచారణ చేపట్టారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో రాబర్ట్ కుంద్రాను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు.

రాజ్‌కుంద్రా ప్రముఖ పారిశ్రామిక వేత్త. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలతో ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై రాజ్‌కుంద్రాపై గత ఫిబ్రవరిలో కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా మొబైల్ యాప్‌లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్‌కుంద్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news