వివాదంలో లక్ష్మి పార్వతి పొలం..అంబటి అవహేళన !

-

గుంటూరు : వైసిపి నాయకురాలు లక్ష్మి పార్వతి పొలం వివాదంలో చిక్కుకుంది. సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల లో లక్ష్మి పార్వతి కి రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఈ పొలం పర్యవేక్షణ బాధ్యతలను సత్తెనపల్లి బిజేపి మండల అధ్యక్షుడు కోటేశ్వరరావుకు అప్పగించారు. అయితే.. జలకళ పథకం లో భాగంగా పోలంలో బోరు వేయించాలని సూచించారు లక్ష్మి పార్వతి.

ఈ విషయంపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు ను కలవాలని బిజేపి అధ్యక్షుడు కు సూచించారు లక్ష్మి పార్వతి. అయితే అక్కడ బోరు వేయకుండా ఇబ్బందులు సృష్టించారు స్దానిక నేతలు. అయితే స్దానిక నేతల వ్యవహార శైలీపై అంబటి రాంబాబు కు ఆ బిజేపి నేత ఫోన్ చేశారు. అయితే ఈ సంఘటనపై అంబటి రాంబాబు విచిత్రంగా స్పందించారు. లక్ష్మి పార్వతి పొలం గురించి తనకు అసలు ఫోన్ చేయవద్దని పేర్కొన్నారు అంబటి రాంబాబు.

దీంతో సీరియస్ అయిన ఆ బిజేపి నేత.. గవర్నర్ , సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసుకో ఎలాంటి ఇబ్బంది లేదని అంబటి అవహేళన చేశారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు నుంచి తనకు ప్రాణహానీ ఉందని బిజేపి నేత కోటేశ్వరరావు ఆరోపించారు. ఈ ఘటనపై లక్ష్మి పార్వతి ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news