నీలిచిత్రాలు చట్టబద్ధం.. వ్యభిచారం ఎందుకు కాదు

– 12ఏండ్ల నాటి శిల్పాశెట్టి భర్త ట్వీట్ వైరల్

న్యూఢిల్లీ: అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తొమ్మిదేళ్ల క్రితం చేసి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో రచ్చరచ్చ చేస్తున్నది.

వ్యభిచారం చట్టబద్ధం కానప్పుడు నీలి చిత్రాలు ఎందుకని ప్రశ్నిస్తూ 45ఏళ్ల రాజ్ కుంద్ర తన ట్వీట్‌ల ప్రశ్నించారు.

వ్యభిచారం vs నీలిచిత్రాల గురించి మాట్లాడుకుందాం? కెమేరా ముందు సెక్స్ చేయడం ఎందుకు చట్టసమ్మతం? వ్యభించారం చేయడం ఎందుకు కాదు? అని 2012, మార్చిలో రాజ్ కుంద్రా ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రం రాజ్ కుంద్రాను అరెస్టు చేయడంతో 12ఏండ్ల క్రితం నాటి ట్వీట్ బయటకు వచ్చింది.

రాజ్ కుంద్రా ట్విట్టర్ యూజర్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ‘ఇప్పటికైనా సమాధానం దొరికిందా’ అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

దేశంలో అశ్లీల చిత్రాలను నిర్మించడం, ఇతరులకు పంపించడం నేరం. కానీ, ప్రైవేటుగా నీలి చిత్రాలను వీక్షించడం మాత్రం లీగల్. వ్యభిచారంపై చట్టల్లోనే స్పష్టత లేదు. కాలక్రమంలో సెక్స్ వర్కర్లు, వారి పిల్లలు దోపిడీకి గురికాకుండా ఉండటం కోసం వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి డిమాండ్లు కూడా వస్తున్నాయి.

నీలిచిత్రాల కేసులో ఇప్పటివరకు ముంబయి పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మంగళవారం రాజ్ కుంద్రాకు అత్యంత సన్నిహితుడు ర్యాన్ థోర్ప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

సినిమాలో యాక్టింగ్ చాన్స్ ఇప్పిస్తామని హామీ ఇచ్చి, నీలి చిత్రాల్లో నటించమని బలవంతం చేయడంపై ఓ యువతి ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 4న ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో రాజ్ కుంద్రానే ప్రధాన నిందితుడు అని, అతడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభించినట్లు పోలీసులు తెలిపారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని రాజ్ కుంద్రా తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. కానీ, అతడిని మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.