మండిపోతున్న సూర్యుడు.. ఆ రాష్ట్రంలో 50 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

-

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఇక శనివారం రోజున రాజస్థాన్‌లోని ఫలౌదీలో ఏకంగా 50 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సార్వత్రిక ఎన్నికల ఆరో దశలో ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఈ ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడ్డారు. ఎండను కూడా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన ఓటర్లకు కేంద్రాల దగ్గర నీళ్లు లేవు. వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు లేవు. కొన్ని చోట్ల వడగాడ్పులకు ఓటర్లు సొమ్మసిల్లిపడిపోయారు.

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) లెక్కల ప్రకారం.. 2019 జూన్‌ 1వ తేదీ తర్వాత 50 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కావడం దేశంలో ఇదే తొలిసారి. వేడి గాలులు ఉత్తర మైదాన, మధ్య ప్రాంతాల్లోనే కాదు.. హిమాచల్‌ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లోనూ ప్రతాపం చూపించాయని ఐఎండీ అధికారులు తెలిపారు. రాజస్థాన్, పంజాబ్, హరియాణా, దిల్లీ, చండీగఢ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. భానుడి భగభగలు ఈ రాష్ట్రాల్లో ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news