మధ్య ప్రదేశ్ లో సీఎం ప్రత్యర్థిగా రామానంద సాగర్ ‘రామాయణం’ నటుడు..!

-

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకుగానూ 55.. మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకుగానూ 144, ఛత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలకుగానూ 30 స్థానాలకు అభ్యర్థులను నిర్ణయించింది. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌ ప్రత్యర్థిగా ప్రముఖ నటుడు, రామానంద్ సాగర్ రామాయణంలో హనుమాన్ పాత్రధాని విక్రమ్ మస్టల్‌ను దింపింది.

బుధ్ని స్థానంలో బీజేపీ అభ్యర్థి, సీఎం చౌహన్‌తో విక్రమ్ మస్టల్ తలపడనున్నారు.మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్‌కు ఛిద్వారా.. మాజీ సీఎం దిగ్విజయ్ తనయుడు, మాజీ మంత్రి జయవర్దన్ సింగ్‌కు రాఘిఘాట్ సీట్లను కేటాయించింది. అలాగే, రాజ్యసభ మాజీ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి విజయ్ లక్ష్మీ సాధోకు మహేశ్వర్ (ఎస్సీ), మరో మాజీ మంత్రి జీతు పట్వారీకి రౌ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news