10 రూపాయల నాణెంపై మరోసారి ఆర్బీఐ క్లారిటీ.. ఏం చెప్పిందంటే?

-

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నిసార్లు స్పష్టతనిచ్చిన పది రూపాయల నాణేల వినియోగంపై మాత్రం ఇంకా చాలా మందికి అపోహలు వీడటం లేదు. ఈ నాణేలను తీసుకోవడానికి ఇప్పటికీ వెనకాడుతున్నారు. ఈ ప్రచారం ఎలా మొదలైందో గానీ, పది రూపాయల నాణెం చెల్లదనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఈ వదంతులపై తాజాగా మరోసారి ఆర్బీఐ ప్రకటన జారీ చేసింది. ఎలాంటి ఆకృతుల్లో ఉన్న పది రూపాయల నాణెమైనా చెల్లుతుందని తేల్చి చెప్పింది. అందువల్ల ఈ కాయిన్ను నిరాకరించొద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

పది రూపాయల కాయిన్ మీద అపోహల వల్ల ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్‌ల్లో ఈ నాణేలు లక్షల్లో పేరుకుపోతున్నాయి. ఈ డబ్బును పెట్టేందుకు చోటులేక సిబ్బంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పది రూపాయల నాణేలను నిరాకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆర్‌బీఐ ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటెయిల్‌ సంస్థల ప్రతినిధులతో ఇవాళ విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పది రూపాయల కాయిన్పై ఉన్న అపోహలను దూరం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news