రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది.కార్డు లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఈ విధానం ద్వారా ఏటీఎంలలో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం కార్డులెస్ విత్ డ్రాలను కొన్ని బ్యాంకులు మాత్రమే కనిపిస్తున్నాయని, అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్వర్క్స్ లో కార్డు లెస్ విత్ డ్రా అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య పరపతి విధాన ప్రకటనను ఆయన ప్రకటించారు.
కార్డు లెస్ విత్ డ్రా ద్వారా వినియోగదారుడు తన వద్ద డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేసుకునే అవకాశంం ఉంటుంది. దీని ద్వారా కార్డు స్కిమ్మింగ్, కార్డు క్లోనింగ్ లాంటి చర్యలను కూడా అడ్డుకోవచ్చని అని ఆయన అన్నారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల జారీని ఆపేది లేదని, ఆ కార్డులను కేవలం కాష్ విత్ డ్రా కోసమే కాదు అని వాటిని రెస్టారెంట్లు, షాపులు విదేశీ టూర్లకు సమయంలో వాడుకునే వీలుందన్నారు.