ఉత్త‌మ పురుష : నా పేరు ఆర్య ల‌వర్ ఆఫ్ గీత  బ‌ర్త్ డే బోయ్ అల్లు అర్జున్

-

నా పేరు ప్ర‌త్యేకం
నా ప్రేమ అనంతం
అన్నాడు ఆర్య
నా ప్రేమ చేసిన తీయ‌ని గాయాల‌ను మాన్పేసిన ఈ హాస్పిట‌ల్ అంటే న‌చ్చ‌లే అని చెప్పాడు ఆర్య‌. అన్నాడు చెప్పాడు త‌రువాత ఏదో ఒక‌టి.. ఇదే మ‌యినా మీడియా నోట్ కాదు క‌దా ! ఆ విధంగా ఆ తోవ‌లో రాసుకుని పోవ‌డానికి ! ఏద‌యితేనేం యాటిడ్యూడ్ కా బాప్ అల్లు అర్జున్ పుట్టిన్రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు. పార్టీ లేదా పుష్ప !
ప్రియాతిప్రియ‌మ‌యిన గీత గారికి న‌మ‌స్క‌రించి రాయున‌ది..అని అప్పుడెప్పుడో చెప్పాడు. రెడ్ ఇంక్ లో ఉంటాను గ్రీన్ ఇంక్ లో వ‌స్తాను అని కూడా రాశాడు. కాలేజీ ప్రేమ అది.. ఏదో న‌వ‌రాగం వింటూ పుట్టిన ప్రేమ అది.. ప్రేమ నీ సావాసం నా ఊహ‌ల సామ్రాజ్యం అని పుల‌కించిన రోజు అది.. ఐ ల‌వ్ యూ అన్న ప‌దం గ‌మ‌నించ‌ర భాయి యూ ల‌వ్ మి అని అర్థం అక్క‌డ లేదోయి అని చెప్పిన రోజు అది. ప్రేమకు కొత్త డెఫినిష‌న్ ఇచ్చి వెళ్లాడు. ఆ సినిమాతో అల్లు వారింటి అబ్బాయి కెరియ‌ర్ మారిపోయింది.

 

ప్ర‌తి క‌థ‌కూ ఒక బ్లాకింగ్  పాయింట్ ఉంటుంది. దానిని వెత‌కాలి.. అదే వెతికాడు సుక్కూ.. ప్ర‌తి మాట‌కూ ఏదో ఒక చోట ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది.. అది కూడా వెతికాడు సుక్కూ.. డైరెక్ట‌ర్ సుక్కూ ఆ సినిమాతో అంద‌రికీ చేరువ. కొంద‌రికి ఇవాళ్టికీ ఓ స్ఫూర్తి. సుక్కూ రైటింగ్స్ లో ఆర్య అనే సినిమా ఒక్క‌టే మ్యాజిక్.. కాదు మ్యాజిక‌ల్ స్పియ‌ర్ …

సినిమా చూస్తూ చూస్తూ కొన్ని లాజిక్కులు..సినిమా గురించి రాస్తూ రాస్తూ మరికొన్ని లాజిక్కులు క‌లిస్తే ఆర్య 2 అయింది.ఆ క‌థ‌కు ఆ పేరు లేక‌పోతే బాగుండు.. ఇరు తీరాల మ‌ధ్య నలిగిపోయిన ఓ ప్రేమికుడి భావాలు ఇంకాస్త బెటర్ గా చెబితే బాగుండు. అయినా ప్రేమ ఎందుకు భారం అవుతుంది? అని కూడా బెట‌ర్ గా చెప్పాలి. చెప్ప‌లేదు సినిమా ఫెయిల్..కానీ లాజిక్కులు అన్నీ ఎవ‌ర్ గ్రీన్. ఈ సినిమాతో కూడా బ‌న్నీకి పేరొచ్చింది.
ఆ త‌రువాత అత‌ను పరుగు తీశాడు. డైరెక్ట‌ర్ : భాస్క‌ర్.. అదే క‌ళ్ల‌తో వింత‌గా వంతెనేసింది.. నిజంగా హాయిలో న‌న్నిలా ముంచివేసింది.. అని పాడుకున్నాడు.. ఆ సినిమా ఎంద‌రినో బాగా ప్ర‌భావితం చేసింది.ఫ్యామిలీ ఆడియెన్స్ కు అదొక పెద్ద రిలీఫ్ పాయింట్.. ఇంకా బాగా ఆలోచించాల్సిన విష‌యం కూడా ! లేచి పోయిన బాప‌తు క‌థ‌లను ఇంత బాగా చూపించ‌వ‌చ్చా అని చెప్పిన సినిమా..ఆ విధంగా అనుకుంటూ రాసిన క‌థ మ‌రియు క‌థ‌నం. కూతురిపై తండ్రి ప్రేమ పుష్క‌లంగా ఆఖ‌రి వ‌ర‌కూ గుమ్మ‌రించిన సినిమా.. ప్ర‌కాశ్ రాజ్ లాంటి వారికే సాధ్యం అయ్యే సినిమా.. బ‌న్నీకి ప్ల‌స్ పాయింట్ లా నిలిచిన సినిమా ప‌రుగు.
త‌రువాత రేసుగుర్రంతో సురేంద‌ర్ రెడ్డి ఓ క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఇచ్చారు. అటుపై అల‌వైకుంఠ పురి అంటూ త్రివిక్ర‌మ్.. మ‌రో హిట్ ఇచ్చారు. ముందు సినిమాల క‌న్నా బాక్సాఫీస్ రేంజ్ పెంచిన హిట్. జులాయి క‌న్నా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి క‌న్నా బాగా వ‌చ్చిన సినిమా ఇది అని బ‌న్నీ ఫీల్ అయిన సినిమా..క‌ట్ చేస్తే ఇప్పుడు పుష్ప.. పుష్ప రాజ్..ఏం పాపా న‌చ్చినానా నీకు అని.. న‌వ్విస్తూ.. కొన్ని సన్నివేశాల్లో మెప్పిస్తూ.. అడ‌వి దారుల్లో ఓ చీక‌టి కోణానికి వెలుగు రేఖ పుష్ప ..పుష్ప రాజ్.. ద రైజ్ .. ద రూల్.. ఏదో ఒక‌టి..ఒక‌టి చెబితే ఇంకొక‌టి మిగిలే ఉంటుంది.
ఏదేమ‌యినా ఇవాళ ఒక‌టి ఎక్కువైంది అదే బ‌న్నీ అంటే స‌గ‌టు ప్రేక్ష‌కుడికి పుట్టే ప్రేమ..క‌లిగే ప్రేమ..విస్తరించే ప్రేమ..విస్తృతం అనుకునే ప్రేమ.. ఎనీవే హ్యాపీ బ‌ర్త్ డే బ‌న్నీ.. చెప్పాను బ్ర‌ద‌ర్ వింటున్నావా…అన్న‌ట్లు, విన్న‌ట్లుపార్టీ లేదా పుష్ప.

 

 

 

– రత్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి..

Read more RELATED
Recommended to you

Latest news