మణిపూర్‌లో మరోసారి రీపోలింగ్ జరుగనుంది. ఔటర్ మణిపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 30వ తేదీన రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ ఆరు పోలింగ్ కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు చోసుకున్నాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రోజున మరోసారి పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఓటర్లలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని మణిపూర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఝా కోరారు. గత శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఔటర్ మణిపుర్ లోక్‌సభ స్థానంలో సుమారు 82 శాతం నమోదయింది. 4.85 లక్షల మంది తమ ఓటు వేశారు. కాగా, మొదటి విడత ఎన్నికల్లో భాగంగా జరిగిన ఇన్నర్ మణిపుర్ లోక్‌సభ పోలింగ్‌లో కూడా రీపోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. , పోలింగ్ కేంద్రాలపై దాడులు జరడగంతో 11 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22వ తేదీన రీపోలింగ్ నిర్వహించారు.