నేను సిఎం అయితే 10 లక్షల ఉద్యోగాలిస్తా !

-

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం బీహార్ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ హామీల వర్షం కురిపిస్తున్నారు. అసలు ఆ హామీలు అమలు చేసేవా కాదా అనేది వారికయినా అవగాహనా ఉందో లేక పిచ్చి ప్రజలే కదా నమ్మేస్తారులే అనుకుంటున్నారో ? తెలీదు కానీ వారి హామీలు మామూలుగా లేవు. అక్కడ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని చెబుతోంటే రాని వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రస్నిస్తున్నాయి ప్రతి పక్షాలు.

tejaswi yadv
tejaswi yadv

ఇక బీహార్‌లో ఆర్జేడీ అధికారంలోకి వస్తే పదిలక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వియాదవ్. ఈరోజు ఆయన పాట్నాలో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో బీహార్‌ ప్రజలపై వరాల జల్లు కురిపించారు తేజస్వీ యాదవ్. పేదలు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ 400 నుంచి వెయ్యి రూపాయలకు పెంచుతామన్నారు. నిరుద్యోగులకు 15 వందల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. బీహార్ గ్రామాలను స్మార్ట్ విలేజ్‌ గా మారుస్తామని తేజస్వి యాదవ్ హామీలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news