Asia Cup 2023 : రోహిత్, కోహ్లీ బ్యూటిఫుల్ మూమెంట్

-

నిన్న శ్రీలంకతో మ్యాచ్లో రోహిత్ ను కోహ్లీ అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలంక ఇన్నింగ్స్ 25వ ఓవర్ లో రవీంద్ర జడేజా బౌలింగ్లో దసున్ శనక ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఉన్న రోహిత్ అద్భుతంగా పట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న కోహ్లీ రోహిత్ ను కౌగిలించుకొని అభినందించారు. ఇది బ్యూటిఫుల్ మూమెంట్ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయనేది ప్రచారం మాత్రమే అంటున్నారు.

Rohit, Kohli beautiful moment
Rohit, Kohli beautiful moment

కాగా, పాకిస్తాన్ శ్రీలంకపై ఘన విజయాలు సాధించిన భారత జట్టు 4 పాయింట్లు, మెరుగైన రన్ రేటుతో ఆసియా కప్ ఫైనల్ కు చేరింది. బంగ్లాదేశ్ పై గెలిచిన శ్రీలంక, పాకిస్తాన్ లు చేరో రెండు పాయింట్లతో ఉన్నాయి. ఈ క్రమంలో రేపు ఆ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కీలకం కానుంది.ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది. ఒకవేళ వర్షంతో రద్దు అయితే మెరుగైన రన్ రేటుతో శ్రీలంక ఫైనల్ కు చేరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news