ఈ నెల 15న తెలంగాణలో 9 ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం

-

ఈ నెల 15న తెలంగాణలో 9 ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కువైందని మంత్రి కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ లో అన్నారు. ‘సీఎం కేసీఆర్ ను బూతులు తిట్టే జర్నలిస్టులు… యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే మేం మౌనంగా ఉన్నాం.

బండి సంజయ్, రేవంత్ రెడ్డి కూడా సీఎంను బూతులు తిడతారు. అయినా సంయమనంతో వ్యవహరిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితుల్లో ఉన్నాయా? ప్రతి వెధవ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? అని ఫైర్ అయ్యారు.

తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమంటే పారిపోయిన కిషన్‌రెడ్డి, తెలంగాణ వాదులపై రైఫిల్‌ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డి, తెలంగాణకు బద్ధ వ్యతిరేకిగా పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకున్న కేవీపీ, తెలంగాణ వాదాన్ని అవహేళన చేసిన షర్మిల లాంటివాళ్లు తెలంగాణ వాదులా? అని మండిపడ్డారు. వాళ్లంతా తెలంగాణ వాదులై రాష్ట్రాన్ని తెస్తే తాము ప్రేక్షకపాత్ర వహించామా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news