హెల్మెట్ పెట్టుకో బ్రో…పాక్ బ్యాటర్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కౌంటర్

-

హెల్మెట్ పెట్టుకో బ్రో అంటూ పాక్ బ్యాటర్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కౌంటర్ పేల్చాడు. నిన్న పాక్‌ పై 228 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌ తో నిన్న జరిగిన మ్యాచ్ లో బ్యాక్ బ్యాట్స్మెన్ సల్మాన్ తీవ్రంగా గాయపడ్డాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో హెల్మెట్ లేకుండా ఆడిన సల్మాన్… స్వీప్ షాట్ ఆడి క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు.

RTC MD Sajjanar counters on Pak batter
RTC MD Sajjanar counters on Pak batter

ఈ తరుణంలోనే బాల్ ఒక్కసారిగా బౌన్స్ అయి అతని మొఖానికి తగలడంతో రక్తం కారింది. ఈ సంఘటన జరగగానే అందరూ షాక్ కు గురయ్యారు. వెంటనే అతనికి కంకేసన్ టెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 24 ఓవర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ గాయం అనంతరం బ్యాటింగ్ చేసిన సల్మాన్ వెంటనే అవుట్ అయ్యాడు. అయితే.. దీనిపై సజ్జనార్‌ స్పందించారు. హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే.. ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు సజ్జనార్‌. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త! అంటూ హెచ్చరించారు.

https://x.com/SajjanarVC/status/1701284096415244594?s=20

Read more RELATED
Recommended to you

Latest news