మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త..స్పెషల్ బస్సు ఏర్పాటు

-

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును #TSRTC ఏర్పాటు చేసిందని… చార్మినార్-గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయించిందని వివరించారు. 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్.. బుధవారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.

ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా చార్మినార్ వెళ్తుందని చెప్పారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి గండి మైసమ్మకు బయలుదేరుతుంది.

ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని కోరారు. అలాగే.. పాక్‌ మ్యాచ్‌ ను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. హెల్మెట్‌ పెట్టుకోకపోవడం వల్లే.. ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు సజ్జనార్‌. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్‌ రక్షణ కవచం లాంటిది. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ సమయంలో హెల్మెట్ ను విధిగా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఇలా ప్రమాదాలకు గురవుతారు.. జాగ్రత్త! అంటూ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news