మేకిన్ ఇండియా భేష్.. మరోసారి మోదీ నాయకత్వంపై పుతిన్ ప్రశంసలు

-

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రశంసించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధానాలను కొనియాడారు. మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన రీతిలో ముందుకు వెళ్తున్నారని పుతిన్ అన్నారు. వ్లాదివోస్తోక్‌లో జరిగిన ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

వ్లాదివోస్తోక్‌లో జరిగిన ఈస్టర్న్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో రష్యా తయారీ కార్ల గురించి మీడియా పుతిన్​ను ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. రష్యాకు గతంలో దేశీయంగా తయారైన కార్లు లేవని.. కానీ ఇప్పుడు ఉన్నాయని అన్నారు. 1990ల్లో భారీ స్థాయిలో కొనుగోలు చేసిన ప్రముఖ కంపెనీ కార్లతో పోల్చుకుంటే ఇవి కూడా మెరుగైనవేనని చెప్పారు. కానీ స్వదేశీ తయారీ విషయంలో రష్యా భాగస్వాములు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలని అన్నారు.

ఈ విషయంలో భారత్ కాస్త ముందడుగులో ఉందని పుతిన్ అన్నారు. భారత్.. స్వదేశీ తయారీ, వినియోగంపై దృష్టి పెట్టిందని.. మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ నాయకత్వంలోనే భారత్‌ సరైన రీతిలో ముందుకు వెళ్తోందని పుతిన్‌ ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version