మోదీ జీ రష్యాకు రండి.. ప్రధానికి పుతిన్ ఆహ్వానం

-

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధాని నరేంద్ర మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాలని కోరారు. క్లిమ్లిన్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో భేటీ అయిన పుతిన్ ఈ మేరకు మోదీకి ఆహ్వానం పలికారు. ఈ భేటీలో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలపై పుతిన్తో జైశంకర్ చర్చించారు.

ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ వర్తమాన అంశాలపై చర్చించేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏడాది రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ సంక్షోభం శాంతియుతంగా పరిష్కృతమవ్వాలని మోదీ కోరుకుంటున్న సంగతి తనకు తెలుసని పేర్కొన్నారు. దాని గురించి తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిపై భారత్‌కు మరింత అదనపు సమాచారం అందజేస్తామని వెల్లడించారు. భారత్‌తో తమ దేశ వాణిజ్య లావాదేవీల్లో వరుసగా రెండో ఏడాది గణనీయ పెరుగుదల నమోదవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ముడి చమురు, అత్యాధునిక సాంకేతిక రంగాలు ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news