శబరిమల ఆలయానికి వెళ్లే…భక్తులకు బిగ్ అలర్ట్. నేడు శబరిమల ఆలయం మూసివేయనున్నారు. నేడు శబరిమల ఆలయంలో మండలపూజ జరుగనుంది. ఇవాళ రాత్రి 11 గంటలకు సన్నిధానం తలుపులు మూయనున్నారు ట్రావెన్ కోర్ అధికారులు.

చివరి రోజు కావడంతో శబరిమలలో భారీగా అయ్యప్పల భక్తుల రద్దీ కొనసాగుతోంది. అటు శబరిమల అయ్యప్ప దర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. శబరిమల అయ్యప్పను ఇప్పటి వరకు 34 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో గడిచిన 40 రోజుల్లో శబరిమలకు 208 కోట్ల ఆదాయం వచ్చింది. కానుకల రూపంలో 67 కోట్లు వచ్చినట్టు ప్రకటించింది ట్రావెన్ కోర్ సంస్థ.