హైదరాబాద్‌లో కొవిడ్‌ కలకలం.. అప్రమత్తం అవసరమంటున్న వైద్యులు

-

తెలంగాణలో చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లో కొవిడ్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. గత వారం రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 45, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా.. అవన్నీ హైదరాబాద్‌లోనే అయ్యాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 1,333 పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 59 మంది కరోనా చికిత్స పొందుతున్నారుని పేర్కొన్నారు.

మరోవైపు ఉస్మానియాలోని అత్యవసర విభాగంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం చేరినవారిలో ఇద్దరు ఇటీవల మృతి చెందారు. అయితే వారికి సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులూ చేయగా ఇద్దరిలోనూ పాజిటివ్‌ లక్షణాలు కనిపించాయని వైద్యులు తెలిపారు. వారి మృతికి కరోనా కారణం కాదని, అప్పటికే వారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దృష్ట్యా చికిత్స పొందుతూ మృతి చెందారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news