ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ తో సచిన్ కొడుకు డేటింగ్..?

-

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తో అతను సన్నిహితంగా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో అర్జున్.. వ్యాట్ తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండులో విహరిస్తున్నారు.

అర్జున్ రెస్టారెంట్ లో విందు ఆరగిస్తున్న ఫోటోను ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ వ్యాట్ సోషల్ మీడియాలో పంచుకుంది.” నండోస్ రెస్టారెంట్ లో నా బుజ్జి మిత్రున్ని చూస్తున్నందుకు సంతోషంగా ఉంది” అంటూ వ్యాట్ పేర్కొంది. కాగా గతంలో అర్జున్ టెండూల్కర్, డానియెల్ వ్యాట్ కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. అర్జున్ టెండూల్కర్ అమ్మమ్మ పుట్టిల్లు ఇంగ్లాండ్ కావడంతో, తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. అర్జున్ టెండూల్కర్ ఇక్కడి మైదానాల్లో ఇంగ్లీష్ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news