‘ది కేరళ స్టోరీ’ మేమూ చూస్తాం.. సుప్రీంకోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

‘ది కేరళ స్టోరీ’ సినిమాపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చిత్రంపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు వెలువరించింది. తమిళనాడులోనూ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించిన న్యాయస్థానం.. చిత్రంలో వివాదాస్పదంగా మారిన ఓ అంశం గురించి మార్పు చేయాలని  నిర్మాతకూ సూచించింది. సీబీఎఫ్‌సీ ధ్రువీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు ఆ చిత్రాన్ని ఓసారి చూడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.

‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ప్రజల అసహనాన్ని కారణంగా చూపుతూ చట్టపరమైన నిబంధనలను ఉపయోగించలేరు. లేదంటే, అన్ని సినిమాలది ఇదే పరిస్థితి.’ అని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన సీజేఐ ధర్మాసనం పేర్కొంది. చెడు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద దెబ్బతింటాయని వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news