GHMC ఎన్నికల తరువాత సీన్ మారింది : ప్రధాని మోడీ 

-

జీహెచ్ఎంసీ మేయర్ పదవీ బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను అడిగారు. అందుకు మేము ఒప్పుకోలేదు. అప్పుడే  కేసీఆర్ అవినీతి బాగోతం గురించి చెప్పాను.. ఆ తరువాత నుంచి కేసీఆర్ నన్ను కలవడం లేదు. మరోవైపు  అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోంది. తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో పంచిపెట్టాన్ని. ఎంత జనాభా ఉంటే.. అంత హక్కు అని కాంగ్రెస్ అంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నాకు స్వాగతం పలికేవారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సీన్ మారిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రశక్తి లేదని చెప్పాము. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చారని తెలిపారు మోడీ. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారు. తాను కూడా ఎన్డీఏ లో చేరుతానని కేసీఆర్ అడిగారు. నేను కేటీఆర్ కు రాష్ట్రంలో బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ నాతో చెప్పారు. మీది ఏమైనా రాజులా యువరాజును సీఎం చేయడానికి అని అడిగానని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news