ఇందూరు ప్రజాగర్జన సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు. తెలంగాణ కోసం కేంద్రం భారీగా నిధులు బీఆర్ఎస్ వాటిని లూటి చేసిందన్నారు. తెలంగాణ లో ఒక కుటుంబం ప్రజల ఆంక్షలను కబ్జా చేశారు. కుటుంబ పాలనలో అంతా తమ వారికే లబ్దిపొందేలా చూసుకుంటారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ నాకు స్వాగతం పలికేవారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సీన్ మారిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే ప్రశక్తి లేదని చెప్పాము. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్ కు డబ్బులు ఇచ్చారని తెలిపారు మోడీ. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారు. తాను కూడా ఎన్డీఏ లో చేరుతానని కేసీఆర్ అడిగారు. నేను కేటీఆర్ కు రాష్ట్రంలో బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ నాతో చెప్పారు. మీరు ఏమైనా రాజులా యువరాజును సీఎం చేయడానికి అని అడిగినట్టు తెలిపారు మోడీ.