సెప్టెంబరు 21నుండి ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు ఓపెన్ అవుతున్నాయో తెలుసా..?

-

అన్ లాక్ 4.0లో భాగంగా పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయనేది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ 21వ తేదీ నుండి పాఠశాలలు తెరుచుకోవచ్చని కేంద్రం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఏయే రాష్ట్రాలు పాఠశాలలని తెరవబోతున్నాయో ఇక్కడ చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటైన్ జోన్ మెంట్లలో మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అక్టోబర్ 5వ తేదీ నుండి మొదలవుతాయి. హర్యానాలో 9నుండి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకి వచ్చి గైడెన్స్ తీసుకోవచ్చట. కొన్ని చోట్ల స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని అంటున్నారు.

అస్సాంలోనూ 9నుండి 12వ తరగతి వారికి క్లాసులు జరుగుతాయట. ఉత్తరప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, గుజరాత్ లలో పాఠశాలలు ఓపెన్ కావట్లేదట. ఐతే ఎక్కడైతే పాఠశాలలు తెరుచుకుంటున్నాయో అక్కడ ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే. పాఠశాలల్ని శానిటైజ్ చేయడం, పాఠశాలకి వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకి టెంపరేచర్ చెక్ చేయడం, క్లాసులు జరుగుతున్నా ఆన్ లైన్ క్లాసులని రన్ చేయడం వగైరా అన్ని పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version