ఆ రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠ‌శాల‌లు

-

పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా 21 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. కొవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తూ ఎస్‌వోపీల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు సోమవారం నుంచి స్కూళ్లకు వెళ్లవచ్చని చెప్పింది. అయితే.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని సూచించింది. ప్ర‌తీ ఒక్క‌రు ఫేస్‌ మాస్క్‌ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవాల‌ని, ప్ర‌తీ ఒక్క‌రు నిబంధనలు పాటించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది.

అయితే.. కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం పాఠశాలలు మూసే ఉండనున్నాయి. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యాన, జమ్మూ కాశ్మీర్‌, కర్నాటక, పంజాబ్‌ సహా పలు ఇతర రాష్ట్రాలు, యూటీలు నేటి నుంచి పాక్షికంగా పాఠశాలలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సోమవారం నుండి తరగతులు తిరిగి ప్రారంభించడానికి అనుమతించబోమని ఢిల్లీ, గుజరాత్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌ ప్రకటించాయి. ఇదిలా ఉండ‌గా.. పాఠ‌శాల‌లు తెర‌వ‌డంపై విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news