సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కన్నుమూత

-

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95)బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టు  లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దీని తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.

నారిమన్‌ సీనియర్ న్యాయవాదితో పాటు, 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. నారిమన్ 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. అతను 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన మరణించడం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news