ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. రుతుపవనాలు వచ్చిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా మొదలయ్యాయి. ఆగస్టులో దాదాపు పదిరోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. సెప్టెంబర్‌లో మాత్రం అంతగా కురిసే అవకాశాలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సాధారణ సగటు కంటే జూన్‌లో తొమ్మిది శాతం తక్కువ లోటు ఉండగా.. జులైలో 13శాతం ఎక్కువగా నమోదైంది. మరో వైపు సెప్టెంబర్ 17 నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లనున్నారు. రుతుపవనాల ఉపసంహరణ ఆలస్యం కారణంగా గత నాలుగేళ్లుగా సెప్టెంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నా.. తూర్పు, ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వర్షపాతం తగ్గితే నిత్యావసర ధరలు పెరిగే అవకాశం పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.