ఈ మధ్య అశ్లీల వీడియో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడటం కామన్ అయిపోయింది. అలా ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా కేంద్ర మంత్రికే అశ్లీల వీడియో కాల్ చేశారు. చివరకు కటకటాల వెనక్కి వెళ్లి ఊచలు లెక్కిస్తున్నాయి. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు వాట్సాప్ ద్వారా గత వారం ఒక వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే అశ్లీల వీడియో కనిపించడంతో కట్ చేసి వరాలను వ్యక్తిగత కార్యదర్శికి తెలియజేశారు.
ఆయన ఫిర్యాదుతో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నిందితులను రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలను భరత్‌పూర్‌కు పంపి నిందితులను అరెస్టు చేసినట్లు దిల్లీ పోలీస్ కమిషనర్ తెలిపారు. అయితే ఆ నిందితులు మంత్రి ఫోన్‌కు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి.. అంతకముందు మంత్రి వీడియో కాల్‌కు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీనిపై మంత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు’’ అని మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అలోక్ మోహన్ తెలిపారు.