అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠకు శరద్‌ పవార్ దూరం

-

అయోధ్యరామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులను శ్రీరామ జన్మ మందిర ట్రస్టు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ అతిథుల్లో రాజకీయ, సినీ, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు, వేద పండితులు ఉన్నారు. ఇందులో భాగంగా ఆహ్వానం అందుకున్న ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని తెలిపారు. తనకు అందిన ఆహ్వానంపై రామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌కు బదులిస్తూ లేఖ రాశారు. ఇంతకీ అందులో ఏం ఉందంటే?

జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత దర్శనానికి వస్తానని శరద్ పవార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పుడు దర్శనం సులభంగా ఉంటుందని అన్నారు. అంతేగాకుండా అప్పటికి రామ మందిరం నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని తెలిపారు. మరోవైపు 2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news