చంద్రబాబుకు మరో షాక్‌..వైసీపీ లోకి మాజీ ఎమ్మెల్యే

తెలుగు దేశం పార్టీ మరో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎం జియావుద్దీన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. మంగళవారం సీఎం జగన్‌ ను కలిసారు జియావుద్దీన్. ఈ నేపథ్యంలోనే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎస్.ఎం. జియావుద్దీన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మా కుటుంబానికి మాట ఇచ్చి మాట తప్పారని ఎస్.ఎం. జియావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మా సోదరుడు లాల్ జాన్ బాష మరణం తర్వాత మాకు అన్యాయం చేశారని చంద్రబాబు ఫైర్‌ అయ్యారు.

పాదయాత్ర సమయంలో చంద్రబాబు మా కుటుంబానికి అన్యాయం చేశారని జగన్ చెప్పిన తర్వాతే కంటి తుడుపుగా మైనారిటీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు మైనార్టీ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని సీరియస్‌ అయ్యారు ఎస్.ఎం. జియావుద్దీన్. జగన్ మైనారిటీలకు డిప్యూటీ సీఎంతో సహా అనేక పదవులు ఇచ్చి ఎంతో గౌరవిస్తున్నారని… అందుకే ముఖ్యమంత్రికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఎస్.ఎం. జియావుద్దీన్ స్పష్టం చేశారు.