నా ప్రదర్శనకు ధోనీయే స్ఫూర్తి : శివమ్ దూబే

-

తాను మంచి ఫినిషర్ గా మారెందుకు భారత కెప్టెన్ ధోని స్ఫూర్తినిచ్చారని ఆల్రౌండర్ శివమ్ దూబే తెలిపారు. ఐపీఎల్ లో ఆయన సీఎస్కేలో ఆడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆఫ్గాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో 2 వికెట్లు, 60 పరుగులతో చెలరేగారు దుబే. ధోనీని తాను స్ఫూర్తిగా తీసుకోవడమే తన ప్రదర్శనకు కారణమని ఆయన మ్యాచ్ అనంతరం స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఎంఎస్డి ఆటను దగ్గర నుంచి పరిశీలించే అవకాశం దక్కిందని తెలిపారు.

Shivam Dube Credits MS Dhoni For Acing Finisher’s Role In India’s Win Over Afghanistan In 1st T20I

అయితే.. ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడిన రింకు సింగ్…. ఇటీవల ధోనీని కలిసిన విషయాన్ని, అతనితో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకున్నాడు. “నెంబర్ 6 లో బ్యాటింగ్ చేయడం….మ్యాచ్ లను ముగించడం అలవాటుగా మార్చుకున్నాను. ఈ ఫినిషర్ బాధ్యత పట్ల సంతోషంగా ఉన్నాను. తీవ్రమైన చలిలో ఆటను ఆస్వాదించాను. ఇటీవల నేను ధోని భాయ్ తో మాట్లాడాను. బంతిని బట్టి ఆడాలని ఆయన సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పారు. నేను అదే చేస్తున్నాను. బ్యాటింగ్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఆలోచించను. బంతికి తగ్గట్లు మాత్రమే రియాక్ట్ అవుతాను” అని రింకూసింగ్ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news