జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు షాక్.. ముంబై ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్న అధికారులు

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఇమ్మిగ్రేష‌న్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె పై ఈడీ లుకౌట్ నోటీసులు ఉన్నా.. విదేశాల‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని ముంబై ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. కాగ ఆది వారం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విదాశాల‌కు వెళ్ల‌డానికి ముంబై విమానాశ్ర‌యానికి చేరుకుంది. దీంతో విమానాశ్ర‌యం లో ఉన్న ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారు. అయితే రూ. 200 కోట్ల కు సంబంధించిన మ‌నీ లీండ‌రింగ్ కేసు లో జాక్వెలిన్ ఈడీ విచారిస్తుంది.

అంతే కాకుండా జాక్వెలిన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మ‌నీ లాండరింగ్ కేసు లో ప్ర‌ధాన నిందితుడి గా సుకేష్ చంద్ర శేఖ‌ర్ ఉన్నాడు. అయితే జాక్వెలిన్ కు సుకేష్ చాలా విలువైన బ‌హుమ‌తులు ఇచ్చాడ‌ని ఈడీ పేర్కొంటుంది. అందు కోసం జాక్వెలిన్ ప‌లు సార్లు ఈడీ విచారించారు. అయితే మ‌రో సారి విచారించ‌డానికి ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్ర‌మం లో ఆ నోటీసులకు స్పందించ‌కుండా.. విదేశాల‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించ‌డం తో జాక్వెలిన్ ను అడ్డుకున్నారు. అయితే జాక్వెలిన్ ను కొద్ది సేపు విచార‌ణ చేసి వెళ్లేందుకు అనుమ‌తి ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news