రేపు మరోసారి ఈడి విచారణకు సోనియా గాంధీ

-

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కు సంబంధించిన ఆస్తుల కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఇదివరకే సోనియాగాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి కూడా ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ సమన్లు జారీ అయ్యాక సోనియా కరోనా బారిన పడగా.. రాహుల్ గాంధీ ఇప్పటికే ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.కాగా ఈనెల 21 నుంచి సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలో రేపు మరోసారి ఈడీ ముందుకు హాజరు కావాలని సోనియా గాంధీని కోరింది ఈడి. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిలు, ఇన్చార్జిలు, ఎంపీలు హాజరుకానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ నేతలు, రాజ్గాట్ వద్ద ఏఐసిసి, సిడబ్ల్యుసి సభ్యులు, జనరల్ సెక్రటరీలు, సత్యాగ్రహ నిరసనలు చేపట్టనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్ళనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news