పార్లమెంట్ నూతన భవనంలో సమావేశాలు ఆ రోజు నుంచే..?

-

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రాజకీయంగా చర్చోపచర్చలకు దారి తీస్తోంది. దాని ప్రత్యేక ఎజెండా ఏంటో చెప్పాలని ప్రతిపక్షాల పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయని.. వినాయకచవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి సమావేశాలను నూతన భవనంలోకి మార్చనున్నారని విశ్వసనీయ వర్గాల నుంచి ఓ వార్తా సంస్థ వెల్లడించింది. భారతదేశంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తి చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తున్న అమృత్ కాలంలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్టు ఇటీవలే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి  వ్యాఖ్యానించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version