స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ షాక్ ఇచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. ఇవాళ ఉదయం 11:55 గంటలకు సెన్సెక్స్ 172 పాయింట్లు పడిపోయి 80,329 దగ్గర.. నిఫ్టీ 56 పాయింట్లు పడిపోయి 24,452 దగ్గర ట్రేడవుతుంది.
ఇది ఇలా ఉండగా,లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తున్నారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా.. పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు.. ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ.. నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.