విడాకుల తర్వాత భర్త భరణం అడిగే మహిళలకు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. పని చేసే వీలున్న మహిళ, విడాకుల తర్వాత భర్త భరణం కోసం పాకులాడొద్దని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ముంబైలో పెళ్ళైన 18 నెలలకే భర్త నుంచి విడాకులు కోరి.. రూ.12 కోట్లతో పాటు ముంబైలో లగ్జరీ ఫ్లాట్ భరణం కింద ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది ఓ మహిళ.

మహిళ ఉన్నత విద్య చదివిందని తెలుసుకొని.. మీరెందుకు ఉద్యోగం చేయరు? ఇతరులపై ఆధారపడకుండా హుందాగా జీవించవచ్చు కదా అంటూ ప్రశ్నించారు సుప్రీంకోర్టు. భరణం కింద ఫ్లాట్ మాత్రమే వస్తుందని తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. పని చేసే వీలున్న మహిళ, విడాకుల తర్వాత భర్త భరణం కోసం పాకులాడొద్దని స్పష్టం చేసింది.