ఈసీల నియామకంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ

-

లోక్‌సభ ఎన్నికల ముందు ఈసీల నియామకం అంశం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం నూతనంగా తీసుకొచ్చిన చట్టాన్ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. ఈ దశలో నిలిపివేస్తే అది తీవ్ర గందరగోళానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించింది.

ఇటీవల ఈసీలుగా బాధ్యతలు చేపట్టిన మాజీ ఐఏఎస్‌ అధికారులు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌ సింగ్‌ నియామకాలను కూడా సుప్రీం ధర్మాసనం ప్రస్తావిస్తూ.. కొత్తగా నియమితులైన వారిపై ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అని, అది పాలనాయంత్రాంగం కింద పని చేస్తుందని చెప్పకూడదని వ్యాఖ్యానించింది. ఈసీల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం తప్పు అని భావించలేమన్న ధర్మాసనం.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, ఈ సమయంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం చాలా ముఖ్యమని అభిప్రాయపడింది. కమిటీలో న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్న వాదన సరికాదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news