BREAKING : ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

-

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశంలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పార్టీలకతీతంగా ఉదయనిధి వ్యాఖ్యలను పలువురు తప్పుబట్టారు. మరికొందరు నేతలు ఖండించారు. కానీ కొంత మంది అతనికి మద్దతిస్తూ మాట్లాడారు. అయితే ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లింది.

Udhayanidhi Stalin comments viral

ఈ క్రమంలోనే ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను తాజాగా విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది. మంత్రిపై ఎఫ్​ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై తమ వాదన ఏంటో తెలియజేయాలని సర్కార్​ను, ఉదయనిధికి ఆదేశాలు జారీ చేసింది.

ఇంతకీ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలేంటంటే.. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని మాట్లాడటంతో దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఉదయనిధి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన 262 మంది ప్రముఖులు అతడిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మరోవైపు ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news