మధుయాష్కీ వల్ల కాంగ్రెస్ 10 సీట్లు కోల్పోవడం ఖాయం అని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్. మధుయాష్కీ ని టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్. మధుయాష్కీ మోసగాడని.. మధుయాష్కీ,ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని ఫైర్ అయ్యారు. న్యూయార్క్ లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్ గా యాష్కీని నిషేధించిందని.. మధుయాష్కీ న్యూయార్క్ లో అటార్నీ కాదన్నారు.
మధుయాష్కీ అమెరికాలో అంట్లు తోమారేమోనని.. దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీలు సంపాదించారని ఆగ్రహించారు. కాకతీయ,గుల్బర్గా యూనివర్సిటీల నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించా…? గతంలోనే నా ఆరోపణలపై యాష్కీ దాడి చేయించారు..నేను చావుకు కూడా భయపడనన్నారు. మధుయాష్కీ పై హైకోర్టు లో పోరాడుతున్నానని..జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఒక్క అంశం పై కూడా మధుయాష్కీ మాట్లాడలేదని వెల్లడించారు. ఎల్బీ నగర్ లో మధుయాష్కీ కి డిపాజిట్లు కూడా రావు…మధుయాష్కీ వల్ల కాంగ్రెస్ 10 సీట్లు కోల్పోతుందని హెచ్చరించారు. నిజామాబాద్ లో ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్.