బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!

-

బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. దోషులకు క్షమాబిక్ష పెట్టే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని వెల్లడించింది. దీనిపై మహారాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు నిందితులను హత్య చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో జీవిత ఖైదు శిక్ష పడిన 11 మంది దోషులను 2022 ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో బాధితులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం గత ఏడాది సుమారు 11 రోజుల పాటు విచారణ చేపట్టారు. అక్టోబర్ 12న తీర్పును రిజర్వ్ చేసి తాజాగా వెలువరించింది. ఈ మేరకు గుజరాత్ గవర్నమెంట్ నిర్ణయాన్ని రద్దు చేసింది. ఖైదీలు అందరూ జైలుకు తిరిగి రావాలని బెంచ్ ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉపశమనం పొందాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news