శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

-

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటికే రామ మందిరంపై క్లియర్ కట్ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమి వివాదం పై సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. మధుర షాహి దర్గాలో సర్వేకు సుప్రీమ్ కోర్టు నిరాకరించింది.

Supreme Court verdict in Shri Krishna Janmabhoomi case
Supreme Court verdict in Shri Krishna Janmabhoomi case

సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. మధుర వివాదం పై ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని పలు పిటిషన్లు దాఖలు కావడంతో సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు కీలకతీర్పు ఇచ్చింది. అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news