SIR అంశంపై సుప్రీం కోర్టు ఆదేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. సంచలన పోస్ట్ చేసింది. బీహార్ SIR అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ భారత ఎన్నికల సంఘం క్రూరమైన దాడి నుంచి ప్రజాస్వామ్యం బయటపడిందని, ఎన్నికల సంస్థ రూపం పూర్తిగా బహిర్గతమైందని, అపఖ్యాతి పాలైందని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా పేర్కొంది.
ఇక ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలను చేర్చడం ద్వారా సుప్రీంకోర్టు రక్షణ కవచాలను ఏర్పాటు చేసిందని.. ఇప్పటివరకు ECI విధానం అడ్డంకి కలిగించే విధంగా, ఓటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రం లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికల జాబితాలో భౌతిక సమర్పణలు చేయడంతో పాటు, మినహాయించబడిన ఓటర్లు ఆన్ లైన్ మోడ్ ద్వారా క్లెయిమ్ లను సమర్పించడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ESI ని ఆదేశించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రెస్పాన్స్ వచ్చింది.