సూరత్ డైమండ్ మార్కెట్ గురించి ఈ విషయాలు తెలుసా?

-

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయంగా ఏర్పాటైన సూరత్ డైమండ్ బోర్స్ను ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అతిపెద్ద కార్యాలయ సముదాయంగా 80 ఏళ్లుగా గుర్తింపు పొందిన అమెరికాలోని పెంటగాన్‌ భవనాన్ని తాజా సూరత్ డైమండ్ బోర్స్ వెనక్కి నెట్టింది. పెంటగాన్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో గుజరాత్‌ ప్రభుత్వం దీన్ని నిర్మించింది.

సువిశాల సుందర భవనం ‘సూరత్ డైమండ్ బోర్స్’ ప్రత్యేకతలు ఏంటో తెలుసా

  • దాదాపు రూ.3,400 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు.
  • దాదాపు 35.54 ఎకరాల్లో, 67లక్షల 28 వేల 604 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి హరిత భవనంగా నిర్మించారు
  • మొత్తం 20 అంతస్తుల చొప్పున 9 టవర్లలో 4,500 కార్యాలయాలు ఉన్నాయి
  • దీని నిర్మాణం కోసం 46 వేల టన్నుల ఉక్కు వాడారు.
  • ఈ కార్యాలయంలో మొత్తం 128 లిఫ్ట్లు ఉండగా.. 18 సెకన్లలోనే 16వ ఫ్లోర్కు చేరుకునే వేగం వీటి ప్రత్యేకత
  • సూరత్ డైమండ్ బోర్స్లో 4 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
  • భవనాల పైకప్పుపై 400 కిలో వాట్ సామర్థ్యం గల సౌర పలకలను అమర్చారు
  • భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 వేల మంది వ్యాపారులు ఈ ప్రాజెక్టు రూపకల్పనలో భాగస్వాములుగా ఉన్నారు
  • ఈ వజ్రాల మార్కెట్ కేంద్రంగా 175 దేశాల నుంచి దాదాపు రూ. 2 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news