లోక్‌సభ ఎన్నికల్లో మీరట్‌ నుంచి తెలుగు నటుడి పోటీ..!

-

మీరట్‌లో వైశ్య సామాజిక వర్గం, ఘజియాబాద్‌లో క్షత్రియ సామాజికవర్గ అభ్యర్థులు టికెట్‌ కోసం పడుతుండగా.. బీజేపీ అధిష్ఠానం నటుడు అరుణ్‌ గోవిల్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించడంతో అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు టికెట్‌ కోసం పోటీ పడ్డారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిత్‌ అగర్వాల్‌ సైతం టికెట్‌ ఆశించారు. ఇటీవల మెట్రోపాలిటన్‌ అధ్యక్షుడు అధ్యక్షుడు ముఖేశ్‌ సింఘాల్‌, వినీత్‌ అగర్వాల్‌తో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. రామాయణంలో రాముడి పాత్రను పోషించి మన్ననలు పొందారు నటుడు అరుణ్‌ గోవిల్‌. రాముడి పాత్రతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడిని బీజేపీ ఎన్నికల్లో బరిలోకి దింపుతోంది.

మొదటి జాబితాలో నాలుగు పశ్చిమ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో మార్పు తథ్యమని బీజేపీ సంకేతాలిచ్చింది. మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్‌కు టికెట్‌ నిరాకరించింది. గత ఎన్నికల్లో బీఎస్పీ-ఎస్పీ కూటమి అభ్యర్థి హాజీ యాకూబ్‌పై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ క్రమంలో తక్కువ మెజారిటీతో గెలిచే ప్రాంతాలపై దృష్టి పెట్టిన బీజేపీ.. సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ కారణంగా రాజేంద్ర అగర్వాల్‌కు టికెట్‌ నిరాకరించి.. అరుణ్‌ గోవిల్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.

Read more RELATED
Recommended to you

Latest news