World Cup 2023 : తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్‌ ప్లేయర్

-

నెదర్లాండ్స్ వరల్డ్ కప్ జట్టులో తెలుగు మూలాలున్న తేజకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆ జట్టు నేడు పాకిస్థాన్ తో తలపడుతోంది. ఈ సందర్భంగా అతడు మా జట్టుకు మద్దతు ఇవ్వాలని తెలుగులో మాట్లాడారు.

Telugu Player Teja Nidamanuru playing for Netherlands
Telugu Player Teja Nidamanuru playing for Netherlands

‘హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్ తో ఉప్పల్ లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్ కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం’ అని అభిమానులను కోరారు. ఆల్ రౌండర్ అయిన తేజ… విజయవాడలో పుట్టారు.

ఇది ఇలా ఉండగా, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇవాళ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా రెండవ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news